ప్రముఖ నటి రేణు దేశాయ్ (Renu Desai) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. బద్రి సినిమాతో టాలీవుడ్ (Tollywood) ప్రేక్షకులకు పరిచయమైన ఆమె.. ఆ తరువాత పవన్ కళ్యాణ్‌ను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఇద్దరు పిల్లలు అకీరా(Akira), ఆద్య. కొన్నాళ్లు అన్యోన్యంగా ఉన్న ఈ జంట మధ్య విబేధాలు తలెత్తడంతో రేణు.. పవన్ నుంచి విడాకులు తీసుకుంది. తర్వాత రేణు దేశాయ్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తన కొడుకు అకీరా, కూతురు ఆద్య(Adya)ల బాధ్యతలపై ఆమె పూర్తిగా దృష్టి సారించారు. మరోవైపు కొంత కాలం క్రితం ఒక వ్యక్తితో ఆమె పెళ్లికి సిద్ధమయిన సంగతి తెలిసిందే. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఆ పెళ్లి జరగలేదు. నిశ్చితార్థం రద్దయినట్టు ఆమె తెలిపారు.
రవితేజ తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao)’లో రేణు దేశాయ్ కూడా నటించారు. ఈ నెల 20న ఆ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ… ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… తన రెండో పెళ్లి (Second marriage) గురించి మాట్లాడారు.నన్ను రెండో పెళ్లి చేసుకోమని సలహాలు ఇచ్చారు. నాకు తోడుగా.. పిల్లలకు అండగా ఉంటారని కన్విన్స్ చేశారు. నేను కూడా వారు చెప్పినదానికి ఓకే అన్నాను. మా కుటుంబానికి, స్నేహితులకు నచ్చిన అతనితో ఎంగేజ్ మెంట్ (Engagement) చేసుకున్నాను. మాది లవ్ అనుకుంటున్నారు. కాదు.. అది కేవలం అరేంజ్డ్. నా గురించి అంతా చెప్పి.. ఓకే అన్నాక మేము ఎంగేజ్ మెంట్ చేసుకున్నాం, ఆ ఫోటోలను కూడా నేను సోషల్ మీడియాలో షేర్ చేశాను.
అప్పుడు ఆద్య వయస్సు 7. ఆ సమయంలో నాకు ఒకటి అనిపించింది. నేను ఇప్పుడు పెళ్లి (wedding) చేసుకుంటే.. అతనికి టైమ్ కేటాయించాలి. అప్పుడు ఆద్య కు టైమ్ ఇవ్వలేను. అందుకే నేను అప్పుడు పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు ఆద్యకు 16 వచ్చాయి. ఒక సింగిల్ పేరెంట్ (Parent) గా పిల్లలకు ఒక వయస్సు వచ్చేవరకు తోడు ఉండాలనుకున్నాను. అందుకే పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకుంటే ఆయనతో పాటు ఆద్యకు కూడా సమయం కేటాయించాల్సి ఉంటుందని… అది చాలా కష్టమనిపించిందని రేణు చెప్పారు. అందుకే రెండో పెళ్లిని రద్దు చేసుకున్నానని తెలిపారు. ఎవరైనా ఒక వ్యక్తి నచ్చితే, ఆయనతో సుఖంగా ఉంటావు అనిపిస్తే పెళ్లి చేసుకోమని అకీరా తనకు చెపుతుంటాడని అన్నారు. మరో రెండు, మూడు ఏళ్ల తర్వాత రెండో పెళ్లి గురించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.