»Bad Work On The Road The Young Woman Harassed The Rickshaw Puller
Video Viral: రద్దీగా ఉండే రోడ్డుపై పాడు పని.. రిక్షాపుల్లర్కు లైంగిక వేధింపులు!
ఓ యువతి చేయకూడని పనిని చేసింది. అదికూడా నడిరోడ్డుపై అలా చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిక్షావాలాతో ఆ యువతి ప్రవర్తించిన తీరుకు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ యువతి పాడుపని చేసింది. రిక్షావాలాతో అసభ్యంగా ప్రవర్తించింది. రిక్షాపుల్లర్ను ఆ యువతి లైంగికంగా వేధించిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. నగరంలోని చాందినీ చౌక్ ప్రాంతం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వాహనాల హడావుడి ఆ ప్రాంతంలో ఎక్కువ. రాత్రి చీకటి పడిన తర్వాత ఓ యువతి రిక్షావాలాను అసభ్యంగా తాకుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రిక్షా పుల్లర్ పట్ల ఆ యువతి చేసిన అసభ్య చర్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. రిక్షాలో కూర్చున్న ఆ యువతి పక్కన అందరూ ఉన్నారనే విషయాన్ని మర్చిపోయింది. చుట్టుపక్కల ఉన్నవారిని సైతం పట్టించుకోకుండా, వాహనాలను గమనించకుండా ఆ యువతి రిక్షా పుల్లర్ ప్రైవేటు భాగాలను తడుముతూ కనిపించింది.
రిక్షా నడిపే వ్యక్తిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆ యువతి మద్యం మత్తులో ఉండి అలా చేసిందని పలువురు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. ఆ యువతి లైంగిక వేధింపులను రిక్షావాలా కూడా అడ్డుకోలేకపోవడం వీడియోలో చూడొచ్చు. 28 సెకన్లపాటు ఉన్న ఈ వీడియో నెట్టింట సందడి చేస్తోంది. కారులో ఉన్న ఓ వ్యక్తి ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో సదరు యువతి చర్యలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.