కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)తో భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు ప్రభాస్. ఇప్పటికే లోకేష్ ఈ క్రేజీ కాంబినేషన్‌ను కన్ఫామ్ చేయగా.. తాజాగా మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు.
ప్రస్తుతం ప్రభాస్(prabhas) భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు. సలార్, కల్కి, మారుతి ప్రాజెక్ట్, స్పిరిట్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఆ తర్వాత సీతారామం దర్శకుడు హనురాఘవపూడితో ఓ యుద్ధ ప్రేమకథ చేయబోతున్నాడు. అలాగే కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో భారీ ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఈ క్రేజీ కాంబో ఎప్పుడుంటుందో తెలియదు గానీ.. ప్రాజెక్ట్ మాత్రం లాక్ అయింది. రిలీజ్‌కు రెడీ అవుతున్న లియో సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు లోకేష్ కనగరాజ్. తాజాగా మరో సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు లోకేష్. ‘ఖైదీ’ మూవీతో తనకంటూ ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసుకున్నాడు లోకేష్.
అయితే లియో లోకీ( Lokesh Kanagaraj) యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిందా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ప్రభాస్‌తో చేయనున్న సినిమా.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎండ్ గేమ్‌గా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై లియో ప్రమోషన్స్ లో భాగంగా క్లారిటీ ఇచ్చాడు లోకేష్. ప్రభాస్ తో తాను చేయబోయే సినిమా LCUలో భాగం కాదని అన్నాడు. ఆ మూవీ స్టాండ్ ఎలోన్ ప్రాజెక్టుగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. తన గత సినిమాలకు ప్రభాస్‌తో చేసే సినిమాకి ఎలాంటి సంబంధం ఉండదని.. ప్రభాస్ కోసం ఒక ఒరిజినల్ స్టోరీని సిద్ధం చేస్తానని అన్నాడు. దీంతో ప్రభాస్, లోకేశ్ సినిమాపై మరింత హైప్ పెరిగింది. కానీ లోకీ యూనివర్స్‌లో భాగంగా ఈ ప్రాజెక్ట్ వచ్చి ఉంటే అదిరిపోయి ఉండేది. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పై వెళ్లడానికి మరో రెండేళ్ల సమయం పట్టనుంది. మరి ప్రభాస్ కోసం లోకేష్ ఎలాంటి పవర్ ఫుల్ స్టోరీ రాస్తాడో చూడాలి.