»Ntr Prashanth Neel Ntr Prashanth Neel Big Update That Day
NTR-Prasanth Neel: ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్.. ఆరోజు బిగ్ అప్డేట్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి.. అప్టేట్స్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. అయితే.. ఈ సినిమా షూటింగ్ విషయంలో ఆరోజే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
NTR-Prashanth Neel: NTR-Prashanth Neel.. Big update that day?
NTR-Prasanth Neel: ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన సినిమాల్లో.. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లాంచింగ్ కోసం ఒక్క నందమూరి అభిమానులే కాదు.. మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సలార్ 2 షూటింగ్ కంప్లీట్ అయిపోగానే ఎన్టీఆర్ 31ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు ప్రశాంత్ నీల్. మే మంత్ ఎండింగ్లో సలార్ 2 షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. వీలైనంత త్వరగా సలార్ 2 షూటింగ్ కంప్లీట్ చేసి.. ఈ ఏడాది చివర్లో ఎన్టీఆర్ 31ని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లుగా సమాచారం.
అయితే.. ఈ విషయం పై క్లారిటీ రావాలంటే మే 20 వరకు వెయిట్ చేయాల్సి ఉంది. ఆ రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే ఉంది. దీంతో.. ఆ రోజు దేవర, వార్ 2తో పాటు ఎన్టీఆర్ 31 అప్డేట్స్ రాబోతున్నాయి. దేవర నుంచి టీజర్ లేదా ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతోంది. వార్ 2 నుంచి టైగర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే.. ఎన్టీఆర్ 31 అప్టేట్ కూడా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్‌కు బర్త్ డే విష్ చేస్తూ.. షూటింగ్ అప్టేట్ బయటికొచ్చే అవకాశముంది.
షూటింగ్ ఎప్పటి నుంచి మొదలు కానుందనే విషయంలో ఖచ్చితంగా క్లారిటీ ఇస్తారని అంటున్నారు. అదే జరిగితే.. టైగర్ ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి. ఎన్టీఆర్‌తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. కెజియఫ్, సలార్ సినిమాలకు మించిన సబ్జెక్ట్‌తో ఎన్టీఆర్ 31 తెరకెక్కబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారు. ప్రశాంత్ నీల్ ఊహకందని విధంగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. మరి ఎన్టీఆర్ 31 ఎలా ఉంటుందో చూడాలి.