»Zomato Ceos Post After Video Of Woman Delivery Agent Riding Superbike
Delivery Agentగా యువతి.. తమకేం సంబంధం లేదంటోన్న జొమాటో సీఈవో
ఇండోర్ వీధుల్లో ఓ అమ్మాయి జొమాటో ఆర్డర్ డెలివరీ చేస్తోంది. కంపెనీ మార్కెటింగ్ స్ట్రాటజీ అని ఒకరు సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి కామెంట్ చేయగా.. సీఈవో దీపిందర్ ఖండించారు.
Zomato CEO's Post After Video Of Woman ‘Delivery Agent’ Riding Superbike
Zomato Delivery Agent: మరోసారి ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో (Zomato) వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ట్యాక్స్ గురించి దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ సారి ఓ యువతి జొమాటో ఫుడ్ డెలివరీ చేస్తోంది. సూపర్ బైక్ మీద డెలివరీ చేస్తుండటం విశేషం. ట్రెండీగా ఉన్న యువతి.. షర్ట్ వేసుకుంది. రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకుని మోడల్లా ఉంది. భుజాలపై జొమాటో డెలివరీ బ్యాగ్ తగిలించుకొని కనిపించింది.
ఇండోర్‌లో ఈ ఘటన జరిగింది. ఆ వీడియోను రాజీవ్ మెహతా అనే వ్యక్తి షేర్ చేశాడు. ఇదీ జొమాటో మార్కెటింగ్ స్ట్రాటజీ అని రాసుకొచ్చారు. ఇది కంపెనీ ఉద్దేశం అని పేర్కొన్నారు. జొమాటో ఇండోర్ మార్కెటింగ్ హెడ్ ప్లాన్ ఇది. ఓ మోడల్‌ను తీసుకొని ఖాళీ బ్యాగ్ వేసుకొని నగరమంతా రోజు ఉదయం గంటపాటు తిప్పుతారు. సాయంత్రం గంట పాటు తిప్పుతారు. ఇలా జనాలను కంపెనీ ఆకర్షిస్తోందని రాసుకొచ్చారు. దాంతో జొమాటో సీఈవో స్పందించారు. ఆ యువతితో తమ కంపెనీకి సంబంధం లేదని చెప్పారు. ఇండోర్‌లో జొమాటో మార్కెటింగ్ హెడ్ లేరని క్లారిటీ ఇచ్చారు. అయితే మహిళలు ఫుడ్ డెలివరీ చేయడంలో తప్పు లేదు కదా అన్నారు. జొమాటో ఎప్పుడూ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా డెలివరీ చేయమని చెప్పదని స్పష్టంచేశారు.
‘ఇండోర్‌లో మార్కెటింగ్ హెడ్ ఎవరూ లేరు. అమ్మాయిలు ఫుడ్ డెలివరీ చేయడంలో తప్పు లేదు. తమ కంపెనీలో వందలాది మంది అమ్మాయిలు రోజు ఫుడ్ డెలివరీ చేస్తారు. అలా తమ కుటుంబాలను పోషించుకుంటూ ఉంటారు. వారు పనిచేయడం పట్ల మేం గర్విస్తున్నాం’ అని దీపిందర్ రాసుకొచ్చారు. హెల్మెట్ పెట్టుకోకపోవడంతో దీపిందర్ ఆందోళన వ్యక్తం చేయగా.. నెటిజన్లు అంతా ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు.