SKLM: పలాస మున్సిపాలిటీ పరిధిలోని ముత్యాలమ్మ కోనేరు అభివృద్ధి పనులను ఆదివారం సాయంత్రం ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు పరిశీలించారు. పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సూచించారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే గౌతు శిరీష కృషి అభినందనీయమని కొనియాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.