TG: హైదరాబాద్లోని బంజారాహిల్స్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ప్రభాత్ సొసైటీ వివాదాస్పద స్థలంలో సీఎం రమేష్ అనుచరులతో వచ్చి హంగామా సృష్టించారు. ఈ క్రమంలో తన భూమిని సీఎం రమేష్ కబ్జాకు యత్నించారని శివనారాయణ ఆరోపించారు. చివరికి ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్కు చేరింది.