కడప: శిల్పారామాన్ని ఆదివారం ఛైర్ పర్సన్ చేరెడ్డి మంజులారెడ్డి సందర్శించి, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రాచీన కళలకు జీవం పోసేలా ఏర్పాటు చేసిన హస్తకళల ప్రదర్శనశాలను ఆమె ప్రారంభించారు. అనంతరం సందర్శకులతో వసతుల గురించి ఆరా తీసి, శిల్పారామం ఉగాది క్యాలెండర్ను ఆవిష్కరించారు. శిల్పారామం ఏవో కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.