NLG: సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలనకు ఆకర్షితులై స్వచ్ఛందంగా పలువురు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం శుభపరిణామమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం గ్రామానికి చెందిన పలువురు వార్డు సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.