»Its My Fault I Didnt Detect Hamas Attacks Israels National Security Adviser
Hamas దాడుల్ని గుర్తించలేకపోవడం నా తప్పే : ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు
ఇజ్రాయెల్ (Israel)పై హమాస్ (Hamas) దాడుల్ని తాము ఊహించలేకపోయామని, దాడుల్ని పసిగట్టకపోవడం నా తప్పేనని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు చేచి హనెగ్బీ అంగీకరించారు.
ఇజ్రాయెల్ (Israel) పై హమాస్ దాడుల్ని తాము ముందుగా గుర్తించలేకపోయామని ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు చేచి హనెగ్బీ (Chechi Hanegbi) అంగీకరించారు. దాడుల్ని ముందుగా పసిగట్టలేకపోవడం తమ తప్పేనని విచారం వ్యక్తం చేశారు. 2021లో జరిగిన యుద్ధంతో హమాస్(Hamas)గుణపాఠం నేర్చుకుని ఉంటుందని భావించాం. కానీ, అలా జరగలేదు. మళ్లీ దాడులకు దిగింది. ఇప్పుడు ఎలాంటి సంప్రదింపులు ఉండవు. వాళ్లని అంతమొందించేవరకూ యుద్ధం చేస్తాం’’ అని హనెగ్బీ పేర్కొన్నారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనా(Palestine)కు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. 5 వేల రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. దీంతో హమాస్ దాడుల్ని పసిగట్టలేకపోయిన ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్(Intelligence)పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఇంటెలిజెన్స్ వైఫల్యంపై తాజాగా ఇజ్రాయెల్ జాతీయ భద్రతా సలహాదారు చేచి హనెగ్బీ మీడియాతో మాట్లాడారు. గాజా సరిహద్దులో ఉన్న సైనిక శిబిరానికి వెళ్లిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) సైన్యంతో మాట్లాడారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతోన్న యుద్ధంలో ఉగ్రవాదులు, సైన్యం, సామాన్యప్రజలు కలిపి ఇప్పటి వరకు 3,500 మంది మరణించారు.