WG: ఉగాది ఉత్సవాలను పురస్కరించుకుని ఆకివీడులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా కవాతు నిర్వహించారు. స్థానిక దత్తక్షేత్రం నుంచి ప్రారంభమైన ఈ కవాతు, జాతీయ రహదారి, ఎస్-టర్నింగ్ మీదుగా సాగింది. ఆకివీడు, ఉండి, కాళ్ల మండలాల సభ్యులు హనుమంతు నాగరాజు, కొయ్యను నాగరాజు, హేమంత్ సత్యల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు పాల్గొన్నారు.