WGL: భద్రకాళి బండ్, కాకతీయ మ్యూజికల్ గార్డెన్లలో చేపడుతున్న అభివృద్ధి పనులను కుడా ఛైర్మన్ ఇనగాల వెంకటరామిరెడ్డి పరిశీలించారు. దశాబ్దాలుగా నిరాదరణకు గురైన కాకతీయ మ్యూజికల్ గార్డెన్‌కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సుమారు రూ. 3.5 కోట్ల వ్యయంతో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ఓరుగల్లు అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఛైర్మన్ అన్నారు.