GDWL: పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. గద్వాల మండలం పరమల శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవాళ ప్రారంభించారు. లబ్దిదారు గౌసియా బి ఇంటి వద్ద గృహప్రవేశం చేయించి, ఇళ్ల నిర్మాణ నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.