అనంతపురం జిల్లా BJP అధ్యక్షుడు కొనకొండ రాజేష్‌ను జల్లిపల్లికి చెందిన వడ్డే రామాంజనేయులు కలిశారు. సీపీఐకి రాజీనామా చేసి వచ్చిన ఆయనకు రాజేష్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పరిపాలన నచ్చి బీజేపీలో చేరుతున్నట్లు రామాంజనేయులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి పాల్గొన్నారు.