NLG: నాగార్జున సాగర్ డ్యాం నీటిమట్టం క్రమంగా తగ్గుతూ డెడ్ స్టోరేజ్‌కు చేరువవుతోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు, కనిష్ఠ స్థాయి 510 అడుగులు కాగా ప్రస్తుతం 535 అడుగుల వద్ద ఉంది. తాగు, సాగు అవసరాలకు రోజుకు సుమారు అడుగు చొప్పున నీరు విడుదలవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 20 రోజుల్లో డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరే ప్రమాదం ఉంది.