JN: జీడికల్ గ్రామంలోని శ్రీ వీరాచల జీడికంటి రామచంద్ర స్వామి వారి ఆలయాన్ని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సందర్శించారు. ఈ మేరకు ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, ఆలయానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అర్చకులు, అధికారులకు ఎమ్మెల్యే సుచనలు చేశారు.