అనంతపురం జిల్లాలో రేపటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు 64 కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణ నాయక్ తెలిపారు. విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. సందేహాల నివృత్తి కోసం 08554 277626 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.