TG: సిద్దిపేట జిల్లా నర్మెట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించారు. 62 ఎకరాలపైగా విస్తీర్ణంలో రూ.300 కోట్లతో అయిల్‌పామ్ ఫ్యాక్టరీని నిర్మించారు. అనంతరం రైతు భరోసా నిధులను విడుదల చేశారు. దీంతో 70 లక్షల మందికి రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇవాళ బ్యాంక్ సెలవులు కావడంతో రేపు రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి.