»Bjp Mp Kirodi Lal Meena Said 500 Crore Black Money 50 Kg Gold In 100 Private Lockers
BJP MP Kirodi Lal Meena: 100 ప్రైవేట్ లాకర్లలో రూ.500 కోట్ల నల్లధనం, 50 కిలోల బంగారముంది
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు 2023 నేపథ్యంలో అక్కడి రాజకీయ పార్టీలు పలు రకాల వ్యూహరచన చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జైపూర్లోని ఓ భవనంలో 100 లాకర్లలో 500 కోట్ల రూపాయల నల్లధనం, 50 కేజీల గోల్డ్ ఉందని బీజేపీ ఎంపీ ఆరోపించారు. అంతేకాదు ఆ లాకర్ ఓపెన్ చేయాలని ఆ భవనం వద్ద కూర్చుని డిమాండ్ చేశారు.
BJP MP Kirodi Lal Meena said 500 crore black money 50 kg gold in 100 private lockers
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీని ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ రాజ్యసభ సభ్యుడు కిరోరి లాల్ మీనా( Kirodi Lal Meena) శుక్రవారం రోజు సంచలన ఆరోపణ చేశారు. జైపూర్లోని ఓ భవనంలో 100 ప్రైవేట్ లాకర్లలో 500 కోట్ల రూపాయల నల్లధనం, 50 కిలోల బంగారం భద్రపరిచారని చెప్పారు. ఆ లాకర్ తెరవాలని బీజేపీ నేత పోలీసులను డిమాండ్ చేశారు. అయితే అది ఎవరి లాకర్ అనేది మాత్రం మీనా వెల్లడించలేదు. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సవాయి మాధోపూర్ స్థానం నుంచి బీజేపీ మీనాను అభ్యర్థిగా నిలిపిందని చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఎన్నికల సంఘం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను మార్చిందని, ఇప్పుడు ఓటింగ్ నవంబర్ 25వ తేదీన జరుగుతుందని ఇప్పటికే ప్రకటించారు. ముందుగా ఓటింగ్ తేదీని నవంబర్ 23గా నిర్ణయించారు. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఈ ఎన్నికల కోసం అక్కడి ప్రజలతోపాటు దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మరోవైపు ప్రస్తుత గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చివేసి బీజేపీ గెలవాలని చూస్తోంది.
जयपुर के गणपति प्लाजा के एक लॉकर के बाहर धरने पर बैठा हूं। इसमें 500 करोड़ रुपये और 50 किलो सोना है। जब तक एसीबी या कोई जाँच एजेंसी यहां नहीं आएगी तब तक यही धरने पर बैठा रहूंगा। pic.twitter.com/BptR3Xe2H8
బీజేపీ రాజ్యసభ సభ్యుడు కిరోరి లాల్ మీనా జైపూర్(jaipur)లోని పింక్ సిటీ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ దాదాపు 100 లాకర్లలో సుమారు రూ.500 కోట్ల నల్లధనం, 50 కిలోల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు వచ్చి లాకర్ తెరిచే వరకు తాను గేటు దగ్గరే కూర్చుంటానని పేర్కొన్నారు. అయితే అది ఎవరి లాకర్ అనేది మాత్రం చెప్పలేదు. పేరు వెల్లడిస్తే రాజకీయ ఒత్తిళ్లతో లాకర్లు తెరవడం లేదని, పేర్లు తర్వాత వెల్లడిస్తానని మీనా అన్నారు. మీడియాతో కలిసి లాకర్లు ఉన్న భవనం వద్దకు వెళ్లారు.
అయితే గత 20 ఏళ్లలో రాజస్థాన్లో జరిగిన నాలుగు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే.. ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విజయం సాధించలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే చాలా మంది ప్రజలు తిరస్కరించారు. ప్రజల్లో అత్యధిక మంత్రులు, ఎమ్మెల్యేలపై స్థానికులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. గత నాలుగు ప్రభుత్వాలలో మంత్రులుగా ఉన్న చాలా మంది నాయకులు వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం కనిపించింది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్ర ప్రజలు ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మారుస్తారనే రాజస్థాన్ ట్రెండ్ సులభంగా అర్థమవుతుంది. అయితే ఈసారి రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ భావిస్తుండగా.. ఈసారి బీజేపీ(BJP) గెల్చి రాజస్థాన్(rajasthan) ట్రెండ్ మారుస్తామని అంటున్నారు.