NLG: మిర్యాలగూడ మండలం అవంతిపురంలో నూతన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం పల్లెల ప్రగతికి కట్టుబడి ఉందని, గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పంచాయతీ భవనాల వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.