TG: హైదరాబాద్‌లోని పంజాగుట్ట కుందన్‌బాగ్‌లో ప్రమాదం జరిగింది. భవన నిర్మాణ పనులు చేస్తుండగా బాల్కనీ నుంచి కిందపడి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ప్రమాదంలో పలువురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.