PDPL: ధర్మారం మండల కేంద్రానికి చెందిన డాక్టర్ స్పందన ధర్మారం ఎండపల్లి బైపాస్ రోడ్డు మార్గంలో బైక్పై వెళ్తుండగా సెల్ ఫోన్ పోగొట్టుకుంది. వెంటనే ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బంది సతీష్ కలిసి ఎంక్వయిరీ చేపట్టి, కొత్తపల్లిలో ఓ వ్యక్తి వద్ద ఫోన్ ఉన్నట్లు గుర్తించి, గంట సమయం లోపు బాధితురాలికి అప్పగించారు.