TG: ప్రజలను CM రేవంత్ తప్పుదోవ పట్టిస్తున్నారని MLC దాసోజు శ్రవణ్ తెలిపారు. అబద్ధాల పునాదులపై రేవంత్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అప్పుల విషయంలో KCRపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో CM అబద్దాలు మాట్లాడితే ఏం చేయాలో ప్రజలే తేల్చాలన్నారు. 6 గ్యారంటీలపై కేటీఆర్ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతారని తెలిపారు. ఈ బిల్లుకు సభ్యులు మద్దతు ఇవ్వాలని సూచించారు.