NLG: నకిరేకల్ మండలంలోని గుట్ట మాజీ ఛైర్మన్ యానాల మల్లారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం పూలమాలలు వేసి నివాళులర్పించారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.