»Son In Law Who Shot And Killed His Aunt At Gundla Singaram Hanamkonda
Son in law shot aunty: అత్తను తుపాకీతో కాల్చి చంపిన అల్లుడు
ఓ కానిస్టేబుల్ తన అత్తమామల విషయంలో కొనసాగుతున్న ఆర్థిక లావాదేవీల విషయంలో కోపుద్రిక్తుడయ్యాడు. ఆ క్రమంలో ఏకంగా తన అత్తపై రివాల్వర్ తో కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృత్యువాత చెందింది.
four months new Bride suicide Relatives are suspect with husband at palnadu
తెలంగాణలోని హనుమకొండ జిల్లా గుండ్ల సింగారం ఇంద్రా కాలనీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ కలహాలతో అత్తను అల్లుడు తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ క్రమంలో రక్తపు మడుగులో ఉన్న మృతురాలు కమలమ్మను వారి కుటుంబ సభ్యులు పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే నిందితుడు కానిస్టేబుల్ ప్రసాద్ కోటపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.