Women Died: హన్మకొండలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు మీద ఉన్న కవిత అనే అనే మహిళను (Women) వేగంగా వచ్చిన కారు ఢీ కొంది. దీంతో ఆ మహిళ ఎగిరి పడిపోయింది. పక్కనే ఉన్న భర్తకు ఏం జరిగిందో తెలియలేదు. ఆ ప్రమాద దృశ్యాలు హృదయ విదారకరంగా ఉన్నాయి. యాక్సిడెంట్ చేసిన కారు శరత్ అనే ఎక్సైజ్ సీఐకు చెందినదిగా గుర్తించారు. ఆ కారులో శరత్ కుమారుడు వంశీ భార్గవ్ ఉన్నాడని తెలిసింది. ఓటు వేసి కవిత వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనను పోలీసులు పట్టించుకోలేదు. దీంతో మృతురాలి బంధువులు ఖాజీపేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.