ఓ మహిళ నడిరోడ్డుపైనే పోలీసుపై చెప్పుతో తీవ్రంగా దాడి చేసింది. అయితే ఆమె అతన్ని ఎందుకు కొడుతుందనే వివరాలు ఇక్కడ చుద్దాం. ఈ దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Uttar Pradesh: ఉత్తర్రప్రదేశ్లోని ఘజియాబాద్‌లో ఓ మహిళ పోలీసుపై చెప్పుతో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ అయ్యింది. అసలు ఆ మహిళ పోలీసును చెప్పుతో ఎందుకు కొట్టిందని వీడియో చూసిన చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మిథిలేష్ అని మహిళ ఈ-రిక్షా నడుపుతోంది. దీనికి నెంబర్ ప్లేట్ లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు బండి పక్కన పెట్టాలని అడ్డుకున్నారు. దీంతో ఆ మహిళ పోలీసులతో గోడవ పడింది.
गाजियाबाद में ट्रैफिक पुलिस कर्मी दरोगा से ई रिक्शा चालक महिला भिड़ी आपस में जोरदार मारपीट की गई जिसमें हाथ चप्पल जूते सब चले pic.twitter.com/bmDz7BQtz5
కోపం తట్టుకోలేక చెప్పు తీసుకుని ఆ మహిళ పోలీస్‌ను కొట్టింది. కేవలం కొట్టడం మాత్రమే కాకుండా అసభ్య పదాలతో పోలీస్‌ను తిట్టింది. అడ్డుకునేందుకు ఇంకో పోలీస్ ప్రయత్నించగా.. తనని రోడ్డుమీదకు తోసేసి అక్కడ నుంచి పారిపోయింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఆమెను గుర్తించి బాధిత అధికారుల ఫిర్యాదుతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు వాళ్లపై దాడి చేసినందుకు వివిధ సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు.