»Bigg Boss Season 7 Arjun Uses His Wits To Defeat Yavar
Bigg boss season 7 telugu: అర్జున్ స్ట్రాటజీకి..యావర్ బలి
ఎవరూ ఉహించనంత విధంగా బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7 కొత్త స్రాటజీలతో ముందుకు వస్తుంది. ఈక్రమంలో కొత్తగా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన కంటెస్టెంట్స్‌కి, పాత కంటెస్టెంట్స్‌కి మధ్య బిగ్ బాస్ చిచ్చు పెట్టింది. ఈ క్రమంలో బిగ్ బాస్ టాస్క్‌ల్లో ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.
bigg boss season 7 telugu: బిగ్ బాస్ 2.0 అని సీజన్ 7లో అయిదుగురు కంటెస్టెంట్స్‌ని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి పంపించారు. అయితే పాత కంటెస్టెంట్స్, కొత్త కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ మంట పెట్టాడు. పాత కంటెస్టెంట్స్‌ను ఆటగాళ్లుగా, కొత్త కంటెస్టెంట్స్‌ను పోటుగాళ్లుగా మార్చి వీళ్ల మధ్య పోటీ పెట్టాడు. వీరిద్దరిలో ఎవరు ఫిట్టెస్ట్, ఎవరు జీనియస్ అని ఇప్పటికే రెండు టాస్క్‌లు పూర్తయ్యాయి. ఈ రెండు టాస్కుల్లో పోటుగాళ్లే లీడ్‌లో ఉన్నారు. తర్వాత ఎవరు ఫాస్టెస్ట్, ఎవరు స్ట్రాంగెస్ట్ పోటీలు జరిగాయి. ఇందులో ఆటగాళ్ల నుంచి ఒకరు, పోటుగాళ్ల నుంచి ఒకరు వచ్చి కలర్, కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ బిగ్ బాస్’ అని అడగాలి. ఆ తర్వాత బిగ్ బాస్ ఇచ్చిన కలర్‌ను బట్టి హౌజ్‌లోని ఏదో ఒక వస్తువును తెచ్చి గార్డెన్లో గీసి ఉన్న బాక్స్‌లో వేయాలి.
ఈ టాస్క్‌లో అమర్దీప్, అశ్విని శ్రీ పోటీ చేయగా వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. బిగ్ బాస్ మెరున్ కలర్ తీసుకురమ్మని చెప్పగా..అశ్వినీ లోపల ఉన్న బాక్స్ తీసుకొస్తుంది. తన దగ్గర నుంచి ఆ బాక్స్ అమర్దీప్ లాక్కుకున్నాడు. తర్వాత కోట్ తీసుకొస్తుండగా.. అమర్ మళ్లీ ఆ కోటు తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆ కోటు వేసుకుని రా. అమ్మాయి మీద చేయి వేస్తే తనకే చెడ్డ పేరు వస్తుందని గౌతమ్ అశ్వినికి సలహా ఇచ్చాడు. అయిన అమర్ అశ్వినిని అడ్డుకున్నాడు. ఈ టాస్క్‌లో ఆటగాళ్లు విజయం సాధించారు.
ఆటగాళ్లు టీమ్ నుంచి ప్రిన్స్ యూవర్, పోటుగాళ్లు టీమ్ నుంచి అర్జున్ మధ్య ఎవరు స్ట్రాంగెస్ట్ పోటీ మొదలయ్యింది. రెండు చేతులతో రెండు పెద్ద రాకెట్లను పట్టుకుని ఎవరు ఎక్కువసేపు నిలబడతారో వాళ్లదే విజయం. అయితే చేతిలోని ఒక రాకెట్‌ను వదిలేసిన ఇంకో రాకెట్‌ను వదలకూడదు. అర్జున్ తెలివిగా ఎడమచేతిలోని రాకెట్‌ను వదిలేశాడు. అర్జున్ స్ట్రాటజీకి బలైన యావర్ ఏమాత్రం ఆలోచించకుండా కుడి చేతిలో ఉన్న రాకెట్‌ను వదిలేశాడు. ఎడమచేతితో ఎక్కువసేపు ఆడలేకపోయిన యూవర్ రాకెట్‌ను వదిలేయడంతో మళ్లీ పోటుగాళ్లే గెలిచారు. పోటుగాళ్లు మొత్తం మూడు టాస్క్‌లు గెలవగా..ఆటగాళ్లు ఒక టాస్క్ మాత్రమే గెలిచారు.