»Beware Of Eye Health World Sight Day 2023 October 12th
World sight day 2023: కంటి ఆరోగ్యం పట్ల జాగ్రత్త…లేదంటే డేంజర్!
మన శరీరంలో సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు పెద్దలు. ఇలాంటి నేపథ్యంలో కళ్లను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. అజాగ్రత్త కారణంగా కళ్లు అనారోగ్యం బారిన పడి పలు రకాల వ్యాధులు సోకుతున్నాయి. అయితే ఈరోజు ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
beware of eye health world sight day 2023 october 12th
ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండవ గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవం(world sight day) జరుపుకుంటాము. ఈ నేపథ్యంలో కంటి చూపు లోపంలో బాధపడే వారి సంఖ్య పెరుగుతున్న క్రమంలో దృష్టి లోపం, అంధత్వం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఈ సంవత్సరం గ్లోబల్ కమ్యూనిటీ కంటి ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని, ప్రతి ఒక్కరికీ కంటి సంరక్షణ సేవలు అందుబాటులో ఉండే విధంగా ప్రోత్సహించాలని ఆయా ప్రభుత్వాలను కోరింది. ఈ సంవత్సరం అక్టోబరు 12న ‘పనిలో భాగంగా మీ కళ్లను ప్రేమించండి’ అనే థీమ్‌తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ అంశంపై భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా పని ప్రదేశంలో వారి దృష్టి విషయాన్ని రక్షించుకోవడం. దీంతోపాటు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకుని సౌకర్యాలు మెరుగుపరచుకోవాలి. అందుకోసం ప్రతిచోటా వ్యాపార సంస్థలు కూడా కార్మికుల కంటి(eye) ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని 2000 సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అంధత్వ నివారణ కోసం అంతర్జాతీయ ఏజెన్సీచే ఈ కార్యక్రమం సమన్వయం చేయబడుతుంది. ఇది మొదట లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ద్వారా SightFirstCampaignలో భాగంగా నిర్వహించారు.