»Nara Lokeshs Second Day Of Cid Investigation Is Over
Nara Lokesh: ముగిసిన నారా లోకేశ్ రెండో రోజు సీఐడీ విచారణ
ఇన్నర్ రిండ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ రెండో రోజు సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు అడిగిన 47 ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పినట్లు తెలిపారు. మరోసారి తనను విచారణకు రమ్మని అధికారులు చెప్పలేదన్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు (Amaravati Inner Ring Road Case)లో రెండో రోజు టీడీపీ (TDP) నాయకుడు నారాలోకేశ్ (Nara Lokesh) విచారణ ముగిసింది. ఐఆర్ఆర్ (IRR Case) కేసులో మొదటి రోజు 50 ప్రశ్నలను సీఐడీ (CID) అధికారులు అడిగారు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పినట్లుగా నారా లోకేశ్ తెలిపారు. అయితే ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం కోసం మరోసారి విచారణకు హాజరుకావాలని సీఐడీ అధికారులు లోకేశ్‌కు నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలో నేడు సీఐడీ ముందు హాజరైన లోకేశ్‌ను అధికారులు పలు ప్రశ్నలు అడిగారు.
నేడు దాదాపు 6 గంటల పాటు తనను విచారించారని నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. నిన్న వేసిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ ఈ రోజు తనను అడిగినట్లుగా లోకేశ్ తెలిపారు. బుధవారం సీఐడీ విచారణ (CID Investigation)లో మొత్తం 47 ప్రశ్నలు వేశారని, తనకు ఎలాంటి సంబంధం లేని కేసులో తనను నిందితుడిగా చూపే ప్రయత్నం సీఐడీ అధికారుల చేస్తున్నారని నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా తనకు ఎలాంటి ఆధారాలు చూపెట్టలేదని, తన తల్లి భువనేశ్వరి (Bhuvaneswari) ఐటీ రిటర్న్స్ రిపోర్టును తనకు చూపించి సీఐడీ అధికారులు ప్రశ్నలు అడిగారన్నారు.
భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ రిపోర్టు (IT Returns Report)లు సీఐడీకి ఎలా వచ్చాయని నారా లోకేశ్ ప్రశ్నించినట్లు తెలిపారు. అమరావతిలో అసలు ఇంత వరకూ వేయని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తన పేరును కక్షపూరితంగానే చేర్చారన్నారు. రెండు రోజుల పాటు దాదాపు 100 ప్రశ్నలు వేశారని, అన్నింటికీ తాను సమాధానాలు చెప్పినట్లు తెలిపారు. మరోసారి సీఐడీ విచారణకు రమ్మని అధికారులు తనకు చెప్పలేదని లోకేశ్ స్పష్టం చేశారు.