»Minister Gudivada Amarnath Said That Nara Lokesh Will Be Punished
Gudivada Amarnath: లోకేష్‌కు శిక్ష పడటం ఖాయం!
చంద్రబాబు ఉన్నది వెల్నెస్ సెంటర్లో కాదని జైల్లో ఉన్నారని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. దోమలు కుడుతున్నాయి, డీహైడ్రేషన్ అంటూ సింపతీ కోసం ట్రైచేయొద్దని ఎద్దేవా చేశారు. ఇక లోకేశ్ చేసింది తప్పని త్వరలోనే అతనికి కూడా శిక్ష పడుతుందని గుడివాడ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Minister Gudivada Amarnath said that Nara Lokesh will be punished
Gudivada Amarnath: చంద్రబాబు(Chandrababu) ఉన్నది వెల్నెస్ సెంటర్లో కాదు. జైల్లో అని మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada Amarnath) పేర్కొన్నారు. నేరాలు, అక్రమాలు చేసిన వారిని పెట్టేందుకే జైల్ వ్యవస్థ ఉందన్నారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దొంగతనం చేసినవారు అడగ్గానే నిజం చెప్పరని, అందుకే పోలీసు వ్యవస్థ, న్యాయస్థానాలు ఉన్నాయని తెలిపారు. డీహైడ్రేషన్ వచ్చినా, దోమలు కుట్టినా జైల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇలా ప్రచారం చేస్తూ సింపతీ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఆయనకు అందుబాటులో 24 గంటలు డాక్టర్లు ఉన్నారని పేర్కొన్నారు. సీఐడీ విచారణ తర్వాత లోకేశ్(Lokesh) మేధవిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీఐడీ వేసే ప్రశ్నలు అమరావతి భూముల స్కాం చుట్టూనే తిరుగుతాయని, లోకేశ్ యోగ క్షేమాలు, భార్య పిల్లల గురించి అడగరని సెటైర్ వేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్డుతో ఏ సంబంధం లేదని ఇప్పుడు లోకేష్ చెబుతున్నాడని, హెరిటేజ్ కోసం అమరావతిలో పద్నాలుగు ఎకరాలు కొనుగోలు చేసినప్పుడు లోకేశ్ ఎందుకు సంతకం పెట్టారని ప్రశ్నించారు. మేధావిలా మాట్లాడినంత మాత్రానా చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరన్నారు. తండ్రీ కొడుకులు ప్రజల భూములను లాక్కున్నారని, ఈ విషయంలో చంద్రబాబు జైల్లో ఉన్నారని, ఇక మిగిలింది లోకేశ్ అని వ్యాఖ్యానించారు. అలాగే విశాఖపట్నంలో ఐటీ కంపెనీ తీసుకొస్తున్నట్లు, ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన ఇన్ఫోసీస్తో సీఎం జగన్ మాట్లాడినట్లు వెల్లడించారు. త్వరలోనే దీనికి సంబంధించిన పనులు ప్రారంభం చేయనున్నట్లు చెప్పారు. అంతేకాదు ఒకేసారి వెయ్యి మందికి ట్రైనింగ్ ఇచ్చే అవకాశం ఉందని అమర్నాథ్ తెలిపారు.