AP: TTD ఛైర్మన్ BR నాయుడును దూరంగా ఉంచినట్లు చంద్రబాబు నాటకాలు ఆడారని భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు నాయుడును అటెండర్ కూడా పట్టించుకోవట్లేదని, నిన్న తిరుమలకు చంద్రబాబు వస్తే.. ఆయన నక్కి నక్కి తిరగారని ఎద్దేవా చేశారు. ఇలా తన పదవి కోసం BR నాయుడు ఎంత అవమానమైనా భరిస్తారన్నారు. ఆయనను ఛైర్మన్ పదవి నుంచి తీసేసి తిరుమల ప్రతిష్ఠను కాపాడి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు.