JN: జనగామ పట్టణంలోని 29వ వార్డులో ఈ నెల 26న నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరుకావాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. ఇవాళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి వేడుకల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ధర్మపురి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.