NLG: కట్టంగూరు మండలంలో పశువుల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ‘గాలికుంటు వ్యాధి’ టీకాలు అక్రమార్కులకు కాసుల వేటగా మారాయి. పేద రైతుల కోసం ఉచితంగా అందాల్సిన టీకాలు దారి మళ్లి, ప్రైవేటు వ్యక్తుల జేబులు నింపుతుండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ టీకాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లాయనేది మిస్టరీగా మారింది. అధికారులు దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.