»Israel Tv Hosts Sister Killed Execution Style While Hiding From Hamas Group
Israel: టీవీ హోస్ట్ చెల్లెలు ఉగ్రవాదుల చేతిలో హత్య..అందుకేనా?
ఇజ్రాయెల్ పౌరులపై హమాస్ ముష్కరులు దారుణాలకు ఒడిగడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు హతమారుస్తున్నారు. ఇజ్రాయెల్ టీవీ యాంకర్ పోస్ట్ చేసిన ఒక ఫోటో నెటిజన్ల హృదయాన్ని కలిచివేస్తుంది. ఎగ్జిక్యూషన్ స్టైల్లో తన సోదరిని హమాస్ ఉగ్రవాదుల గుంపు హత్య చేసినట్లు పేర్కొంది.
Israel TV Host's Sister Killed Execution Style While Hiding From Hamas Group
Israel: ఇజ్రాయెల్(Israel )పై ముందుగా దాడి చేసిన పాలస్తీనాపై అధికారిక యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హమాస్(Hamas), ఇజ్రాయెల్ దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్‌లోని గాజా స్ట్రిప్ సమీపంలోని ఒక సంగీత ఉత్సవంలో పాల్గొన్న 27 మహిళ హమాస్ ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయింది. వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి ఎగ్జిక్యూటివ్ స్టైల్లో హత్యకు గురయ్యింది. మరణించిన వ్యక్తి ఎవరంటే ఇజ్రాయెల్‌లోని ప్రముఖ టెలివిజన్ హోస్ట్ మాయన్ ఆడమ్ సోదరి మాపాల్ ఆడమ్. అయితే తన చెల్లెలు మరణం గురించి మాయన్ ఆడమ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయ విదారక సందేశాన్ని పోస్ట్ చేశారు. హమాస్ గుంపు నుంచి తప్పించుకోవడానికి ఒక ట్రక్కు కింద దాక్కున్నట్లు, తన వీపుపై కాల్చి హతమార్చినట్లు వెనుక బుల్లెట్ గాయాలను బట్టి అర్థం అవుతుందని పేర్కొన్నారు.
తన సోదరి మరణం గురించి తన ఇన్స్టాగ్రామ్(Instagram)లో పంచుకున్నారు. శనివారం మధ్యాహ్నం మాపాల్, తన ప్రియుడు రోయ్ గాజాకు దగ్గర్లో కిబ్బట్జ్ రీమ్ సమీపంలో జరిగిన నేచర్ పార్టీకి వెళ్లారని. అక్కడే ఈ దాడి జరిగినట్లు వెల్లడించింది. పాలస్తీనా ముష్కరులు ఒక్కసారిగా వారిపై విరుచుకపడ్డట్లు, వారి నుంచి తప్పించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసినట్లు తెలిపింది. చివరికీ తమ ట్రక్కు కింద నక్కినా ఉగ్రవాదులు వదలలేదని, ఈ ప్రమాదంలో తన చెల్లెలి బాయ్ ఫ్రెండ్ ప్రాణాలతో బయటపడ్డట్లు తెలిపింది. ఈ ఘటనలో ఇంకా చాలా మంది మరణించినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు.