X New Feature: ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్(X) సంస్థ ఎప్పటికప్పుడు కీలకమార్పులు చేస్తుంది. ఇప్పటికే ట్విట్టర్ నుంచి ఎక్స్‌గా(X) మార్చడం, పక్షి బొమ్మను తొలగించడం, వెరిఫైడ్ అకౌంట్ కావాలంటే డబ్బులు కట్టడం వంటి మార్పులు తీసుకొచ్చింది. ఇప్పుడు తాజాగా ఎక్స్ మరో కీలక మార్పు చేయనుంది. సాధారణ యూజర్లకు రిప్లై విషయంలో బిగ్ షాక్ నివ్వనుంది. రిప్లైలను పరిమితం చేయనుంది. కేవలం వెరిఫైడ్ అకౌంట్ల నుంచి మాత్రమే రిప్లైలు వచ్చే ఆప్షన్‌ను యాడ్ చేసింది.
New add-on feature comes to X. Only Verified accounts or people mentioned by me can reply. 😱🥰
సాధారణంగా ఎవరైనా ప్రముఖ వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేస్తే.. ఇతరులు కామెంట్ రూపంలో రిప్లై ఇస్తుంటారు. వెరిఫైడ్ యూజర్స్ మాత్రమే ఎక్స్‌లో పోస్ట్‌కు రిప్లై ఇవ్వాలనే ఆప్షన్ పెట్టుకుంటే.. ఇక వెరిఫైడ్ కానీ యూజర్స్ రిప్లై ఇవ్వడం కుదరదు. ఈ ఆప్షన్ వల్ల ప్రముఖలకు వేధింపులు, ట్రోలింగ్‌ల బెడద తగ్గే అవకాశం ఉంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికి ఎవ్రీవన్(Every one), మిమ్మల్ని ఫాలో అవుతున్న వ్యక్తులు, కేవలం మీరు మెన్షన్ చేసే వ్యక్తులు అనే ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ సారి కేవలం వెరిఫైడ్ అకౌంట్ల నుంచి రిప్లై వచ్చే ఆప్షన్‌ను తీసుకొచ్చారు. ఎక్స్ యూజర్లను వెరిఫైడ్ అకౌంట్ల వైపు మళ్లించాలనే ఉద్దేశంతో ఎక్స్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.