TG: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 25న తన అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం జగిత్యాలలో ఓ ఫంక్షన్ హాల్‌ను బుక్ చేశారని సమాచారం. తుది నిర్ణయాన్ని ఇవాళ ప్రకటించే ఛాన్స్ ఉంది.