KDP: ప్రొద్దుటూరులో శనివారం రాత్రి స్థానిక రామేశ్వరంలో జరుగుతున్న దేవర ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏఎస్పీ విభూకృష్ణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులందరిని బందోబస్తుకు ఉంచారు. సీఐలు, ఎస్సైలతో పాటు 70 మందికి పైగా పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు.