ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌గా యాత్ర సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా యాత్ర 2 తెరకెక్కిస్తున్నారు. మమ్ముట్టితో పాటు కోలీవుడ్ హీరో జీవా కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా యాత్ర 2 ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
‘Yatra 2’: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషించిన యాత్ర మూవీ.. కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని మాత్రమే కాకుండా సినీ అభిమానులందరినీ మెప్పించింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయకుడు వైఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు.. మహి.వి రాఘవ్ దర్శకత్వం వహించాడు. 2019లో రిలీజ్ అయిన యాత్ర మూవీ గత ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి బాగా కలిసొచ్చింది. ఇప్పుడు 2024 ఎన్నికలని టార్గెట్ చేస్తూ ‘యాత్ర 2’ సినిమాని రెడీ చేస్తున్నారు. మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా కనిపిస్తుండగా.. కోలీవుడ్ హీరో జీవా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రలో నటిస్తున్నాడు.
యాత్ర 2 మూవీని 2024 ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. యాత్ర 2 మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. దాని ప్రకారం.. యాత్ర 2 సినిమాలో ఓదార్పు యాత్ర కీలక ఎపిసోడ్ అవుతుందని హింట్ ఇచ్చారు. ఇక తాజాగా యాత్ర 2 ఫస్ట్ లుక్ పోస్టర్ అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 9న ఉదయం 11 గంటలకి యాత్ర 2 ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసారు మేకర్స్. పోస్టర్లో మమ్ముట్టి, జీవా ఫేస్‌లు రివీల్ చేయకుండా డిజైన్ చేసారు. దీంతో యాత్ర2 లుక్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ అభిమానులు. ఈ సినిమాను యువీ సెల్ల్యులాయిడ్స్, త్రీ ఆటుమైన్ లీఫ్స్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి యాత్ర 2 ఎలా ఉంటుందో చూడాలి.