ఆసియా గేమ్స్ 2023లో ఇండియా, ఆప్గాన్ మధ్య జరిగిన పురుషుల క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. భారత్ టాప్ సీడ్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకుంది.
ఆసియా గేమ్స్ 2023లో భారత పురుషుల టీ20 క్రికెట్ జట్టు స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అయితే ఫైనల్ పోరులో ఇండియా, ఆప్గానిస్తాన్ మధ్య జరిగిన పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచుకు వర్షం అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో మ్యాచును వాన కారణంగా రద్దు చేశారు. దీంతో టాప్ సీడ్ రన్ రేట్ విభాగంలో టీమ్ ఇండియాకు గోల్డ్ పతకం దక్కింది. ఆప్గాన్ రజతంతో సరిపెట్టుకుంది. ఈ పోటీలో ఎక్కువ ర్యాంక్ ఉన్న జట్టు భారత్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఈ స్వర్ణం గెలుపుతో భారత పతకాల సంఖ్య 102కు చేరింది. స్వర్ణాలు 27 ఉండగా..రజతాసు 35, కాంస్యాలు 40 ఉన్నాయి.