అన్నమయ్య: మంచి పోషక విలువలు ఉన్న పౌష్టికాహారంతోనే ఆరోగ్యంగా ఉండగలమని విఆర్డియెస్ సురేంద్రారెడ్డి తెలిపారు. విఆర్డియెస్ సంస్థ ఆధ్వర్యంలో ఛైర్మన్ సురేంద్రారెడ్డి కుమారుడు భువన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టె, ఓఆర్ఎస్ పాకెట్లను పంపిణీ చేశారు. నిరుపేదలకు సహకారం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.