TG: బడికి వెళ్లి చదువుకోమని తల్లి మందలించిందని.. నాలుగో తరగతి బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పూసల తండాలో చోటుచేసుకుంది. రామదాసు, స్వప్న దంపతుల కుమారుడు పవన్.. పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో స్కూల్కు వెళ్లాలని తల్లి మందలించింది. ఈ క్రమంలో బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.