బీఆర్ఎస్ (BRS) కు రాజీనామా చేస్తున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రకటించారు. తన స్థానంలో టికెట్ దక్కించున్న మంత్రి కేటీఆర్ ఫ్రెండ్ జాన్సన్ నాయక్ (Johnson Naik) ఎలా గెలుస్తాడో చూస్తానని రేఖానాయక్ సవాల్ విసిరారు. ఖానాపూర్ (Khanapur) గడ్డా..రేఖానాయక్ అడ్డా అని శఫదం చేశారు. నేనేంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని హెచ్చరించారు.
అయినా నేనేం తప్పు చేశానంటూ నిలదీశారు. ఏమైనా కుంభకోణాలు చేశానా? అని ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు నిధులు కూడా ఇవ్వలేదని వాపోయారు. ఎస్టీ నియోజకవర్గంపై వివక్ష చూపారని రేఖానాయక్ (Rekhanayak) ఆగ్రహం వ్యక్తం చేశారు.అయినా బీఆర్ఎస్లో మహిళలకు విలువ లేదని ఆమె కంటతడి పెట్టారు. ఒంటరిగా పోటీ చేసి బీఆర్ఎస్కు బుద్ధి చెబుతానన్నారు. ఖానాపూర్లో మరో నేతను గెలవనివ్వకుండా చూస్తానని రేఖానాయక్ స్పష్టం చేశారు.