KRNL: మార్చి 28, 29 తేదీలలో ఆలూరులో జరగనున్న ఏఐటీయూసీ 21వ జిల్లా మహాసభల గోడపత్రికలను పత్తికొండలో ఇవాళ విడుదల చేశారు. సమావేశంలో నాయకులు కృష్ణయ్య, రంగన్న మాట్లాడుతూ.. మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్మిక హక్కుల సాధనలో ఏఐటీయూసీ కీలక పాత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని కార్మికులు, నాయకులు పెద్దఎత్తున పాల్గొనాలని కోరారు.