»Hindu Marriage Is Not Valid If Seven Steps Are Not Taken Courts Shocking Verdict
Viral: ఏడడుగులు వేయకుంటే హిందూ వివాహం చెల్లదు..కోర్టు షాకింగ్ తీర్పు
ఓ వ్యక్తి తన భార్య రెండో వివాహం చేసుకుందని కోర్టుకెక్కాడు. కేసును విచారించిన కోర్టు అతని ఫిర్యాదు తప్పని తేల్చింది. తన భార్య ఏడడుగులు వేయకపోవడం వల్ల హిందూ వివాహం జరిగినట్లు నిర్దారించలేమని కోర్టు తెలిపింది. కేసును కొట్టివేస్తూ ఆ వ్యక్తికి షాక్ ఇచ్చింది.
వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. హిందూ వివాహంలో చేసే ప్రతి పనిపై అనేక ఆచారాలు, సంప్రాదాయ నియమాలు ఉంటాయి. పెళ్లిలో ఏడడుగులు వేయడం అనేది అతి ముఖ్యమైన విషయం. మరి దానిపైనే అలహాబాద్ హైకోర్టు ఓ షాకింగ్ తీర్పును ఇచ్చింది. ఏడడుగులు, ఇతర సంప్రదాయ తంతు నిర్వహించకుండా జరిగే హిందూ వివాహం చెల్లుబాటు కాదని అలహాబాద్ హైకోర్టు షాకింగ్ తీర్పునిచ్చింది.
తనకు విడాకులు ఇవ్వకుండా తనను వదిలేసి తన భార్య ఇంకో వివాహం చేసుకుందని ఓ వ్యక్తి కోర్టుకెక్కాడు. అయితే అతని వాదనలు విన్న కోర్టు ఆ కేసును కొట్టివేసింది. వధువు, వరుడు కలిసి నడిచే ఏడడుగులు హిందూ చట్టంలో అత్యంత ముఖ్యమైన తంతు అని, అది తన భార్య విషయంలో కనపడలేదని, అందుకే కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు తీర్పు చెప్పడం విశేషం. జస్టిస్ సంజయ్ కుమార్ ఈ తీర్పునిచ్చారు.
స్మృతి సింగ్ అనే మహిళకు సత్యం సింగ్ అనే వ్యక్తితో 2017లో వివాహం అయ్యింది. అయితే భర్త వేధింపులతో ఇల్లు విడిచి స్మృతి వెళ్లిపోయింది. తన భర్యపై ఆమె కట్నం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేసిన పోలీసులు భర్త సత్యం సింగ్, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే తన భార్య రెండో వివాహం చేసుకుందని, అందుకే ఇలా కేసు పెట్టిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు కోర్టుకెళ్లింది. కోర్టు దర్యాప్తులో ఆ మహిళ రెండో పెళ్లి విషయం అబద్ధమని తేలడంతో కోర్టు కేసు కొట్టివేసింది.