NDL: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని డోన్ పట్టణంలోని ఈద్గా ప్రాంగణంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు.