రంజాన్ పండుగను పురస్కరించుకుని నారాయణపేట ఈద్గా వద్ద భద్రతా ఏర్పాట్లను డీఎస్పీ లింగయ్య పరిశీలించారు. భక్తులను మెటల్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాలను దారి మళ్లించి, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.