CTR: పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు శనివారం సదుం మండలం ఎర్రాతివారి పల్లెలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన స్వగృహంలో నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సోదరుడు భాస్కర్ రెడ్డి వర్ధంతిలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా రాజకీయ అంశాలపై వారు ఇరువురు చర్చించుకున్నారు.