Nara Lokesh Bail Extended On Skill Development Scam
Nara Lokesh: ఏపీ హైకోర్టులో నారా లోకేశ్‌కు ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌ను హైకోర్టు ధర్మాసనం ఈ నెల 12వ తేదీ వరకు పొడగించింది. స్కిల్ స్కామ్‌తోపాటు ఫైబర్ గ్రిడ్ కేసులో ఇదివరకు ముందస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్కిల్ స్కామ్‌లో బెయిల్ పొడగించింది.
స్కిల్ స్కామ్ కేసులో 12వ తేదీ వరకు లోకేశ్‌ను (Nara Lokesh) అరెస్ట్ చేయొద్దని సీఐడీ పోలీసులకు హైకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. బెయిల్‌కు సంబంధించి.. సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్ స్ట్రక్షన్ లేవని.. అందువల్లే బుధవారానికి విచారను వాయిదా వేయాలని కోర్టును కోరారు. విచారణకు హైకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు నారా లోకేశ్‌కు భద్రత కల్పించాలని ఆదేశించింది. ఇన్నర్ రింగ్ రోడ్ ఇష్యూలో ఇప్పటికే సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.