CM KCR:ఓరుగల్లు గడ్డ నుంచి మేనిఫెస్టో ప్రకటన.. గుడ్ న్యూస్ వినేందుకు సిద్ధంగా ఉండండి
బీఆర్ఎస్ మేనిఫెస్టోకు సంబంధించి మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. వరంగల్ బహిరంగ సభ వేదికపై సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారని.. శుభ వార్త వినేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు.
Jaggareddy will not win but will become CM: Harish Rao
Harish Rao: అసెంబ్లీ ఎన్నికల పోరులో అధికార బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు ముందు ఉంది. ఇప్పటికే 105 చోట్ల అభ్యర్థులను ప్రకటించి సంచలనానికి తెరలేపింది. మిగిలింది మేనిఫెస్టోనే.. దానిని త్వరలో ప్రకటిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు మహిళలకు మరిన్ని పథకాలు ప్రవేశ పెడతారని విశ్వసనీయంగా తెలుస్తోంది. మహిళా ఓటు బ్యాంక్ ముఖ్యం అని.. అది దారి మళ్లకుండా చూసుకుంటున్నారు. మక్తల్ సభలో మంత్రి హరీశ్ రావు (Harish Rao) మాట్లాడారు.
అక్కాచెల్లెళ్లను మరింత బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించామని మంత్రి హరీశ్ రావు (Harish Rao) తెలిపారు. వారిని ఆర్థికంగా బలోపేతం చేయాల్సి ఉందన్నారు. మహిళా శక్తిని ఇంకా డెవలప్ చేయాలని అంటున్నారు. సీఎం కేసీఆర్ అందుకోసం ఆలోచన చేస్తున్నారని వివరించారు. ఈ నెల 16వ తేదీన వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ సభ వేదికపై సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను ప్రకటిస్తారని మంత్రి హరీశ్ రావు చెబుతున్నారు. తమ పార్టీ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అవుతోందని చెప్పారు. మేనిఫెస్టోలో ప్రకటించే అంశానికి సంబంధించి శుభవార్త వినడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కోరారు.
బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడమే కాదు.. మేనిఫెస్టోను కూడా ప్రకటించనుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటించే లేదు. ఆ పార్టీ గ్రాఫ్ పెరుగుతోన్న తమకు అనుకూలంగా మార్చుకోవడం లేదు. ఇక బీజేపీ కూడా అంతే.. కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత.. క్యాండెట్లను ప్రకటిస్తారని తెలిసింది.